...

5 views

వలపు వాన..
చల్ల గాలులు, మెల్లగా వీస్తున్న సమయాన, కనులు తెరిచి చూసా నేను..

కోయిల పాటలో,
సెలయేరు నడకలో,
వెన్నెల వెలుగు లో,
చీకటి గదిలో,
వెదికా నిన్ను..
తలచా నిన్ను...

క్షణమైనా మరుగై,
యుగమైనా ఏకమై,
పోదామా.. కలకాలం...
వీడదీయలేదు ఏ కాలం...

నెమలి నృత్యం,
చకోర లాస్యం,
పిచ్చుక ప్రణయం,
అడవి దాచిన రహస్యం..


నీకూ నాకూ తెలుసు,
అందరికీ మనమే అలుసు,
వెన్నెల సొగసు,
తగరని వయసు..


మధుర, సుమధుర, భావమేదో,
కలిపెను ఇద్దరినీ,
మనసూ, మనసూ,
ఉండదు గా వీడీ..
మన జోడీ...

చంద్ర కిరణాల,
సూర్య రావాల చెలి వై,
నిశి లో, మణి వై,
రావే.. రమణి...
ఆనంద బైరవి,
అఖిల నయని....


పండు పున్నమి రోజున,
సఖల భువనాల నీడన,
జరిగే మనువు,
తూగే తనువు,
మనమిద్దరి కొలువు.....

మీనాక్షీ, ప్రియ భాషీ..
మృదు లలన,
హయ వదన,
నాలోన కురిసేనే
వలపు వాన..

© గోవింద్ @...