...

11 views

మనసంతా నువ్వే...✍️
మనసంతా నువ్వే...
మారిపోదాము అనుకుంటే మననం వచ్చేసి...మాసిపోనీవు మన జ్ఞాపకాలను..
మరెందుకు మళ్ళీ మళ్ళీ తుళ్ళిపడే మనసునీ..
నువ్వు నేను అంటూ వేరు చేయడం...
అంతలోనే సవ్వడిచేసే పక్షికూతవై..
ఇంతలో మౌనరాగంతో కట్టడీ చేస్తావు...
ఎంతచూసిన తనివి తీరనీ..
సొంతమైన తనది కాదు అన్నట్టు..
మనసంతా నువ్వున్న...
చెంతలేవన్న చింతనే...
చేరువ నువ్వు వస్తున్నా...
చిత్రాన్ని నా కనుల కుంచె గీస్తుంటే..
ఎద ఆశల రెక్కలతో అల్లరిచేస్తున్నదీ...
ఏమో..ఇదంతా హృదయం పాడే సరిగమనో..
స్వప్నంగా మురిపించిన మన కథనో...✍️