...

2 views

ఓణం పండుగ శుభాకాంక్షలు..✍️🌷
వచ్చిందోయ్...వచ్చింది ఓణం పండుగ
తెచ్చిందోయ్ ..తెచ్చింది సంబురం నిండుగా..!!
అథమ్ తో మొదలయ్యే పదిరోజుల వేడుక
తిరువోణంతో మహాబలి తిరిగి చేరిక...!!
పాతిక వంటలను పచ్చని ఆకున సధ్యగా వడ్డించి...
పడుచుపిల్లలందరూ మహావిష్ణువు నీ శ్రద్ధగా పూజించి...
కసువు చీరలతో..కథాకళి నృత్యాలతో...
ఊరు ఊరంతా ఉత్సాహం..
పూల ముగ్గులతో..పాల బుగ్గలతో ప్రతి ముంగిలిలో పేరంటం...
ఏటిలో తెప్పల పోటీలు...
మేటిగా సంప్రదాయ నృత్యాలు..
అలనాడు మహాబలి ప్రదర్శించిన దానగుణం..
ఇలన నేడు దేవుడై రక్షించే గొప్పగా తిరువోణం..!!

© Rajani Reddy