...

1 views

రెక్కలు తొడిగి
అలిగిన ఆశలను అటక ఎక్కించి ఉదయించిన కొత్త ఊహతో ఏకీభవిస్తూ రెక్కలొచ్చిన కోరికలతో వీరలెవెల్లో అంబర వీధుల్లో విహరిస్తున్నాను అచ్చంగా విహంగమై ..
సూర్యుడు ప్రకాశించమని సవాలు చేస్తాడు, మేఘాలు కదలమని గుర్తు చేస్తాయి, పక్షులు మనం కూడా ఎగరగలమని చెబుతాయి మన కలలు మరియు లక్ష్యాలకు పరిమితి లేదని ఆకాశం చెబుతుంది. కావాలంటే రెక్కలు కట్టుకొని ఎగిరి చూడమంటుంది నిర్మలాకాశం .. పద్మిని బూర "సంపంగి"✍️