...

10 views

నీవేనేమో..!
ఒక కల అద్భుతంలా పలకరించింది💭...
ఆశల హరివిల్లులా రంగులవర్షం కురిపించింది🌈...
ఎదలో ఎదో తెలియని ఆనందం☺️,
అనంతవిశ్వంలో తోకచుక్కలా తోచింది💫...
పదే పదే పలకరించే ఆ ఊహ💭 ,
ఆకాశవీధిలో అందాల జాబిలిలా ఊరించింది🌝...
కలువల కన్నులు కవ్విస్తున్నాయి😌...
మోహన అరవిందం శశిని మరిపించింది👼..
కాలానికి ఎదురెళ్లి వెతికినా,
ఆ రూపం కనికరించలేదు⏱️...
కలవరపెట్టే ఆ సోయగం,కనురెప్పలు మూయనివ్వట్లేదు👀...
ఎవరదీ...!ఈ నా హృదయసామ్రాజ్యాన్ని❤️ అల్లకల్లోలం
చేసి ఆనందకేళిలో ఆటలాడుతున్నది⛹️?
బహుశా ఆ రూపం నీవేనేమో!🤔

#dream_girl @prathyu
© prathyusha.kaipa(gnanvi)