...

3 views

జీవితం.....
మన ప్రమేయం లేకుండానే జీవితం ఎన్నింటినో పరిచయం చేస్తుంది.
కడుపునిండా ఇష్టమైనవి తిన్న రోజులని
ఆకలిగా ఉన్నా తినడానికి సమయమే లేని రోజులని
కంటినిండా ఒళ్ళు తెలియక నిద్రపోయిన రాత్రులని
అసలు నిద్ర పట్టని రాత్రులని
బాధలో ఉన్నప్పుడు తోడుండే బంధాల్ని
బంధుత్వం పేరుతో తీర్చలేని బాధల్ని
ఆకాశానికి ఎగిరేంత ఆనందాన్ని
పాతాళానికి తొక్కేసే మోసాన్ని
నచ్చినా నచ్చకున్నా మనల్ని మెచ్చే మనసుల్ని
ఎంత ప్రయత్నించినా అయిష్టంగా ఉండే మనుషుల్ని
ఎదురుపడితే వంగి దండాలు పెట్టే అధికారాన్ని
పలకరించినా నొసలు చిట్లించే బానిసత్వాన్ని
పంటి బిగువున నొక్కి పట్టిన బాధని
కష్టంగా నవ్వే నవ్వుని
చెప్పలేని అభిప్రాయాల్ని
చెప్పుకున్నా తీరలేని అవసరాల్ని
అన్నీ..అన్నీ..
అసలెన్నో పరిచయం చేస్తుందీ జీవితం
అది ఇచ్చినవి తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండదు మరి
అదేగా జీవితం
ఇదేగా దాని గొప్పతనం.

..నక్షత్ర

© Nakshathra