...

1 views

dahanam
ఊరికే అలా తగలబెట్టేసుకుంటున్నాను నా బాధాతప్త జ్ఞాపకాల్ని
పొగలకి కళ్ళు మఞ్ఞాసు మండుతున్నా
ఒక్కసారిగా రుధిరక్షరాలతో లిఖించబడిన నా వేదన భరిత గతాన్ని వదిలించుకుంటున్నాను
నాకిప్పుడు ఇక్కడ ఇలా ఆనందాల మధ్య గడపాలనుంది
నన్ను నేనుగా చూసుకునే మనిషిగా బ్రతకాలనుంది
అప్పుడెప్పుడో జీవించిందంతా నేను కాదు
గతించిన కాలంలో నేను లేను
నేనో జ్ఞాపకాన్ని మాత్రమే
అప్పుడు శిధిలమైపోయాను ... ఛిద్రమైపోయాను
మిగిలిన శకలాలతో నన్ను నేను కొత్త మట్టిని చేర్చి తయారుచేసుకుంటున్నాను
ప్రాణం పొసే వారి కోసమే నిరంతరం అన్వేషిస్తున్నాను
నీకుందా నాకు ప్రాణం పొసే శక్తి
© director.gopikiran