...

3 views

ఆకలి కేకలు
వినిపించని ఆకలి కేకలు
విసుగెత్తిన బ్రతుకు పరుగులు
జాలిలేని గుండె ధ్వనులు
కారుస్తున్న కన్నీటి సిరలు
ఎప్పటికి కలుగునో మార్పులు
సహించలేని పేద బ్రతుకులు
ఊహించలేని ధనికుల చీదరింపులు
ఆవిరవుతున్న మానవ విలువలు
ఇంకెన్నాళ్ళు ఈ వేదనలు
ముగింపు లేని బానిస రాతలు
సింహమై వినిపించాలి నీ రాతలు
తుడిచేయడానికి ఈ చితిలావస్తలు
చీకటిని చీల్చే వెలుగు గీతలు
నీవే లక్ష్మీనరసింహా.....!
© Manjupreetham Kuntamukkala