...

6 views

నిజమైన ప్రేమ:

నా మనసులో ప్రవహించే నీ తలపులను అడుగు నిజమైన ప్రేమేంటని?
మరపురాని నీ జ్ఞాపకాలతో నిండిన నా గతాన్ని అడుగు నిజమైన ప్రేమేంటని?
నా గుండె వేగాన్ని పెంచే నీ చేతి స్పర్శ ని అడుగు నిజమైన ప్రేమేంటని?
నా మనసును మాయ చేసే నీ నవ్వును అడుగు నిజమైన ప్రేమేంటని?
నా చిరునవ్వుకు కారణమైన నీ రూపాన్ని అడుగు నిజమైన ప్రేమేంటని?
నా శ్రవణేంద్రియాలకు మధురమైన సంగీతంలా వినిపించే నీ గాజుల సవ్వడిని అడుగు నిజమైన ప్రేమేంటని?
ఊహలలో ఊయలూపి జారిపోయిన ఈ సమయాన్ని అడుగు నిజమైన ప్రేమేంటని?
కాగితం మీద అక్షరాలలో బంధించిన నీ ప్రతిరూపాన్ని అడుగు నిజమైన ప్రేమేంటని?
నీ ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోతున్న నన్ను అడుగు నిజమైన ప్రేమేంటని?
నీ హృదయంతో ముడి వేసుకుపోయినా నా హృదయాన్ని అడుగు నిజమైన ప్రేమేంటని?
నీకోసం నా కళ్ళ నుండి కారే ప్రతి కన్నీటి బొట్టును అడుగు నా ప్రేమ విలువెంతని?
- కోలాహలం విశిష్ట
© All Rights Reserved