...

2 views

మన చిరునవ్వులే పూలు
నిట్టూర్పులే తడి మేఘాలు
హృదయమే గగనం
రుధిరమే సంద్రం ఆశే పచ్చదనం
మారే ఋతువుల వర్ణం
మన మనసుల భావోద్వేగం
సరిగా చుస్తే ప్రకృతి మొత్తం
మనలో ప్రతిబింబం
నువ్వెంత?
నేనెంత?
రవ్వంత,
ఎన్నో యేళ్ల ఈ సృష్టి చరిత్ర
అనుభవమే దాచింది కొండంత
తన అడుగుల్లో అడుగేసి
వెళదాం జన్మంతా
ప్రణామం ప్రభాత సూర్యుడికి
ప్రణామం సమస్త ప్రకృతికి ...
సేకరణ,
సంపంగి బూర✍️