...

14 views

అమృతం కురవని రాత్రి....
రేరాజు తనలో తానే స్వయంగా మెరుస్తూ ఉంటే తారలు గొళ్ళుమని
నవ్విన రోజు,
పసిపాప నవ్వులు ఘోరంగా మట్టిలో
కలిసి పోయినప్పుడు,
కలువల అందాన్ని తుమ్మెదలు తాకనపుడు, ‌
కన్నెపిల్ల ఆశలు పసుపు తాడుకు బిగించి నపుడు,
అదే అమృతం కురవని రాత్రి.........


హరివిల్లు విరిగి,
ఆకాశం వైపు నుంచి అంతు చిక్కని
ఆకారాలు పుడమి తల్లికి చిక్కులు
తెస్తున్నపుడు,
గగన వీధుల్లో నరుడు ఒంటరిగా గుంటనక్క లా గ్రహాల మీద పడుతున్నపుడు,
అదే అమృతం కురవని రాత్రి....
........
...........
........by..
.....Govindu @.....





© All Rights Reserved