...

0 views

క్షణం ఒక యుగమై
మనసు తడిసి పోతుంది. మౌనం కురిసిన వేళ ఆశలు కొట్టుకొని పోతున్నాయి. భావన నదిలోన. నీకోసం తపించి తడిసిన మేనుకు పాత గాయాలు లేచి పలకరించాయి. నిద్ర రాని కనులకు గుండెల్లో నిలిచింది రాత్రి నీ కాలి స్పర్శ తాకని హృదయ భూమి ఎండి పోగా అప్పుడు గుర్తోచ్చింది పెదవులు దాటిన నీ మాట కాదని పోయిన నిన్న మొన్నలలో కన్నీరు మున్నీరు అయ్యాయి కనుల మేఘాలు ఏకదాటిగా వర్షించాయి. నీలో లీనమై పోవాలని.. రాత్రులను పగలు చేసి ఎదురు చూస్తూంది తలుపులు తెరిచిన హృదయం క్షణమొక యుగమై ... సంపంగి బూర + ప్రతిలిపి క్షణమొక యుగమై .. - పద్మిని బూర "సంపంగి"