...

2 views

ధార్మికనిధి
ధార్మిక నిధి
************
వివేకానికి చిరునామా
జ్ఞాన భాండాగారం
తర్క చమత్కారం
అతనికి అలంకారం

భారతీయ సంస్కృతిని
ఎల్లలు దాటించిన ఘనత
అనంతమైన జ్ఞాపకశక్తి
అతని ప్రత్యేకత
యువతకు ఆయన వాక్కు
ఒక గొప్ప సందేశం

సంప్రదాయ వేషధారణ
ఆయనకు అమితానందం
విదేశ పర్యటనలో
తెలుసుకున్నాడు అనేక పోకడలు
పరదేశీయులకు అతను భారతీయ సన్యాసి
కాని అతడు నిత్యం సత్యాన్వేషి

అతని ఉక్తిసూక్తులు బడిపిల్లల
మదిలో నిత్యం ఆవర్తన మననం
అంతర్మథన అన్వేషణే
అతని జ్ఞానసముపార్జనకు సోపానం

అతని సూక్తులు పాటిస్తే
యువత మార్గం రాచబాటే
గురువు సేవే పరమ ధర్మంగా భావించి
రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠంల
ద్వార హిందూధర్మాన్ని ప్రపంచ
దేశాలకు పరిచయం చేసాడు
పిన్న వయస్సులో పరమపదించినా,
భారతీయుల మదిలో
చిరస్మరణీయుడు స్వామి వివేకానందుడు
_____________________
జయంతి ( 12-01-1863 )
వర్థంతి (04-7-1902)
___________________
సంధ్య సుత్రావె, SANDHYA SUTRAVE
హైద్రాబాద్.
© sandhya sutrave