...

1 views

బతుకు వెతుకులాటలో
జనన మరణాల మధ్య సాగే ప్రయాణంలో ఎందుకో ఏమిటో తెలియని వారు
బతుకులను వెతుకుతున్నారు జనారణ్యాలలో కూడు,గుడ్డ,నీడలను...
సంతోషాలు శతృవులై,
బాధలు చుట్టాలై ప్రేమ సుఖం ఎరుగదు,
ఆకలి రుచి ఎరుగదు కొన్ని జీవితాలలో,
మబ్బులు ఎంతకురిసినా ఆకాశం తడవని తపనలు, ఆనందాలు ఎప్పుడూ గుర్తుకు రావు,
కానీ అప్పుడు కూడా గుర్తుకొస్తాయి,
ఎక్కడో కొన్ని మిగిలి ఉండిపోయాయని,
బహుశా అందుకే వారి జ్ఞాపకాలు ఇసుకలై పిడికిలి నుండి జారవేస్తూ కాళ్ళతో
ఎగురగొడుతూ జీవిస్తున్నారు
బతుకు వెతుకులాటలో
పద్మిని బూర✍️