...

2 views

దోబూచులాటేలరా...కన్నయ్యా..💓!?
కన్నయ్యకీ ప్రేమతో...
నా కావ్యమై మారిన నీకై..
కలం నింపిన మనసు సిరాతో రాస్తున్నా..!!
ఏమోయ్ కన్నయ్యా...
ఎక్కడనీ నిను వెతుకుతుంటూ వెళ్ళగలను
ఇంటిముంగిలిలోని పారిజాతాలు నవ్వుతుంటే..!!
ఎంతసేపు నీకై వేచుండగలను..
నీ చూపులు సీతాకోకలై నన్ను వెక్కిరిస్తుంటే..!!
ఏమయ్యా.. కన్నా..
ఏ మదిలో కాంచినా నీవే కన్పిస్తుంటే..
మందిరాలకేలా మనోహారా..
మా మనసులన్నీ నీవే దోచేస్తున్నావు మానసచోరా...!!
నాతో దోబూచులాటేలరా చిన్ని కన్నా..
వెన్నముద్దల వేటలో కన్నెలతో పరాచకాలేలా రాధికావల్లభా...!!
పండువెన్నెల్లో నీవే..పగడపు దీవుల్లో నీవే..
పరిమళిస్తున్న పువ్వుల్లో నీ నవ్వులే ...!!
గొల్లవాడల్లో గోపికల నడుమ వేణువులూదగా గోపాలా..
గోకులమంతా పావనమాయేగా...!!
@కన్నయ్యకీ ప్రేమతో...
నీ రాధమ్మనీ..🌷💓✍️