...

2 views

నేనూ నా భావాలు
పుస్తకాలతో పాటు ఇంటి పరిస్థితులను కూడా చదివాను అమ్మ కళ్ళల్లో గెలుపు యొక్క ఎదురుచూపు, నాన్న కళ్ళల్లో మౌనాన్ని చదివాను ఓడిపోవడం అనేది లేదు, గెలుపే ప్రత్యమ్నాయం మాది...
***
శబ్దాలు వర్షబిందువుల కురిస్తే
ఋతువు ఏదైనా కానీ మనసు
తడిసి ముద్దవుతుంది
***
వయస్సు ఎప్పుడైతే నడవడం నేర్చిందో మెట్లు ఎక్కుతూ, దిగుతూ పోయా, పాదాలు అలిసాయి కానీ విశ్వాసం దృఢంగా ఉంది. నడుస్తాను, ఎప్పటిదాకైతే మొత్తం విశ్వాసపు చమత్కారం చూసేవరకు..!!
నేనూ నా భావాలు...
సంపంగి బూర✍️