...

1 views

నీడల వెనుక
ఎప్పటికే నాకై నడవని నీ అడుగులలో ఆగిపోతానంటున్న నా గుండె వైపు ఓసారి నీకంటే ముందే తెలుసుకున్న నీ జ్ఞాపకాల్లో నీవు నాకై లేవని తెలుసుకున్న నా గుండె స్పందన ఆగిపోయింది.. రోజులన్నీ గడిచిపోతూనే కాలం నా దగ్గర రాగానే ఆగిపోయింది.. ఉరుకుల పరుగులతో కడలి వస్తూగుర్తులన్నీ చెరిపేసింది కదలని నా అడుగులు ఏమో కొత్త గీతలు గీసింది, గతించిన కాలమేదో నన్ను అద్భుత కల్పనవని నీ వంతు సాగనంపింది.. క్షణాలన్నీ నాకేసి జాలిగా చూస్తూ గత మెరిగిన జీవితం నిన్ను శాసిస్తుందని కంట నీరెట్టు కున్నాయి నీ చెంతలో చేరిన నా జీవితం అహోరాత్రులు సుఖాలను దాటి కష్టాల పరిధిలో తేలుతున్నాయి అంటూ వాపోయాయి ఒకరు లేని బతుకు ఎంత బరువో తోడుకు నోచుకోని నడకెంతో బరువో గతించి సహించి నీడ లేని నీవు వదిలిన నీడలా నీకై నేను లేని నాకై నీవు లేని బతుకెంత భారమో...
****
నీడల వెనుక అర్ధంగానీ జీవితాలకి మౌనమైన శిధిలాలెన్నో..
కర్తవ్యాల విరుద్ధ యుద్ధాలు ఎన్నో
చేసిన వాగ్దానాలన్నీ నీలి నీడల మిస్సింగులెన్నో కలలుకనే కనులకు రక్తపు చారలెన్నో
రక్కసి మూకలహస్తాలా నేలరాలిన తారలెన్నో
మేక వన్నె పులుల జాడల బతుకు జారిన గాధలెన్నో అమ్ముకోలేని బాధల వెనుక కొనలేని సంతోషాలెన్నో విషాద వేధనలకు వీడ్కోలు పలకని నీడలెన్నో
నేల పాలైన జీవితాలకు కాల రాసిన గుర్తులెన్నో
మూగ రహస్య నీలినీడల సమాధి చేసిన గోడలెన్నో
వడకట్టలేని కన్నీటికి మాయమైన జాడలెన్నో . ..
సంపంగి బూర✍️