...

12 views

చందమామ
నేను లాలి కోసం ఏడుస్తుంటే
నా నిదురలో జోల అయి హాయిని అందించావు......

సాయంత్రం వేళలో నిన్ను చూపిస్తూ నాన్న చెప్పిన ప్రతి కథలోనూ చల్లని వెన్నెల అయ్యావు.....

స్కూల్ నుండి వచ్చాక అలసి పోయిన వేళ కొత్త ఆటగా మారావు.....

కళాశాలలో స్నేహితుల విషయాలు చెప్పుకోవడానికి పౌర్ణమి వేళ.....
మచ్చ లేని స్నేహం అయ్యావు....

కొత్త ఇంట్లో అడుగు పెట్టిన వేళ....
ఓదార్పు వూ అయ్యావు...

అత్త అడిచ్చిన వేళ నీతోనే చెప్పుకున్నాను.....

భర్త బాధ పెడుతుంటే నీ వెన్నెలని ఇవ్వు అని అడిగాను......

నా ప్రతి మలుపులో నువ్వే ఉన్నావు.....

నా ప్రతి సంతోషం నీతోనే నేర్చుకున్నాను......

ఎంత మంది కష్టాలు,కన్నీళ్లు,సంతోషాలు అన్ని నీతో నే చెప్పుకుంటారు ....రాత్రి వేళ...
కానీ నువ్వు ఎవ్వరికీ ఏ బేధం లేకుండా అందరికీ చల్లని వెన్నెల మాత్రమే ఇస్తావు.....నీ మంచి మనసు అందరికీ ఉండాలని ప్రతి రోజూ నీ పున్నమి నీ అందిస్తూ చెప్పకనే చెప్తూ...ఉంటావు....

ఓ..చల్లని జాబిల్లి నువ్వు లేకుంటే...ఎవరితో చెప్పుకొని...
నీ విలువ ఎలా చెప్పను...!