...

3 views

ఓ చిత్రం:

అంతా ఒక మాయే అని తెలిసినా కాలమనే
గాలంలో పడిన మనసు ఓ చిత్రం
అంతులేని ఆశలతో సాగే ఈ జీవితం ఓ చిత్రం
అంతులేని తలపులతో జారిపోయిన ఈ సమయం ఓ చిత్రం
జ్ఞాపకాల కడలిలో సాగే ఈ జీవనం ఓ చిత్రం
నీటి ఆకాశ లోతులను అర్థం చేసుకుంటున్న మనసు లోతులను అర్థం చేసుకోలేక పోతున్నా మనిషి ఓ చిత్రం
బంధాల సంకెళ్ళలో చిక్కుకున్న మనుషులు ఓ చిత్రం
కులమతాల అడ్డుగోడలను కట్టుకున్న ఈ సమాజం ఓ చిత్రం
మంచి చెడుల నడుమ సాగే ఈ ప్రయాణం ఓ చిత్రం
అన్యాయాల కోరలలో చిక్కుకున్న ఈ బతుకులు
వైద్యనే వ్యాపారంగా మార్చుకున్న ఈ రోజులు ఓ చిత్రం
కడుపులు నింపే రైతు కడుపు మంటతో చనిపోతున్న పట్టించుకోని నాగరిక సమాజం ఓ చిత్రం
ఇలాంటి అన్యాయాలు ఈనాటికి జరుగుతున్న నిలబడి చోద్యం చూస్తున్న మానవజాతి ఓ చిత్రం
- కోలాహలం విశిష్ట
© All Rights Reserved