...

2 views

కొత్తగా ఉంది.
జరుగుతుందో జరగదో తెలియని భవిష్యత్తులో జరుగుతుంది అనే ధీమాతో జరగాలి అనే కోరికతో జరుగుతున్న ప్రస్తుతాన్ని మరిచి జరగాల్సిన కర్తవ్యాన్ని జాగు చేస్తున్న వైనం కొత్తగా ఉంది.

జరిగిన గతాన్ని జరగకుండా ఆపలేని ప్రస్తుతంలో జరగకుండా ఉంటే బాగుణ్ణు అనే ఆలోచనల్లో జరిగిపోతున్న కాలాన్ని కలానికి అప్పగిస్తున్న వైనం కొత్తగా ఉంది.

జరగకూడని జాప్యం జరిగిపోతోంది అనే కంగారు, జరగవలసిన కార్యాం జరపకుండా చేజారే సమయం జరుపుకోవాల్సిన తరుణం జరపకుండా చేసే జాడ్యం కొత్తగా ఉంది.

చాలా కొత్తగా ఉంది.