...

2 views

దూరం
చిన్న దూరం ఒకోసారి సుదూరమవుతుంది
చిన్న గాయం ఒకోసారి భయంకరంగా బాధ పెడుతుంది
క్షణకాలం ఏర్పడిన శూన్యం ఒకోసారి మనోధైర్యాన్ని చంపేస్తుంది
మనసుల మధ్య నిశ్శబ్దమంటే
మనుషుల మధ్య యుద్ధం లాంటిది
అది ఎవరినీ చంపకపోయినా తీవ్రంగా గాయపరుస్తూనే ఉంటుంది
శాంతి కలిగినా మచ్చ మిగులుతుంది
వేలి కోసల నుంచి జారే అతి చిన్న స్పర్శ ఒకోసారి అద్భుతాల్ని చేస్తుంది
ఈ దూరాన్ని చెరిపేసే క్రమంలో కాలం కన్నీళ్లను సైతం భరిస్తుంది
అయినా మనసుల మధ్య దూరాన్ని పూడ్చాలంటే
ఎన్ని యుద్ధాలని చేసి
ఎన్ని మనసుల్ని పూడ్చిపెట్టాలో కదా
మరణించిన ఆత్మల మీదుగానే కొత్త సేతువు నిర్మించబడుతుంది అప్పుడప్పుడు
© director.gopikiran