...

15 views

ఓ మాధవ..!
ఓ బాలగోపాలా..!
అనంతవిశ్వం నిన్ను చూసి ఆశ్చర్య పోయింది,
ఇంత అందంగా,
ఇంత అద్భుతంగా
ఎలా ఉన్నావు అని..
చేసిన అల్లరి చేష్టలు నీపై ప్రేమను మరింత పెంచాయి.
యశోధమ్మ విశ్వాన్ని నీ మన్నుతిన్న నోటిలో చూస్తే,
నాకు మాత్రం విశ్వమంతా నీ కళ్లలోనే కనిపిస్తుంది.
మనోహర ముఖారవిందం ఎంత సేపు చూసినా తనివితీరదాయే!
కాలమంతా నీ కాలిదగ్గరే ఆగిపోయింది.
ప్రకృతి ని వైభవాన్ని చూసి విస్తుపోయింది.
మనస్సు ని పాదాలచెంత కనుమరుగయ్యేనే!😍😍
ఓ మాధవా..!
ఎక్కడిదీ సోయగం
ఎక్కడిదీ వైభవం
దేవకీ యశోదల ఓ ముద్దు కృష్ణ!
ఇద్దరమ్మల ప్రేమకు ప్రతిరూపమా!
చిన్ని సైగతో ప్రపంచాన్ని నడిపించే వాడివైనా,
అమ్మ ప్రేమకు దాసుడైనావు.
అమ్మ వడిలో ఒదిగిపోయావు.
పసిబాలుడవు నీవు,
పసిడి మనసున్న పసిబాలుడవు
ఆపద్బాంధవుడవు నీవు
అనంతపద్మనాభుడవు..!
హరే కృష్ణ❤️
© prathyusha.kaipa(gnanvi)