...

0 views

కష్టాల మధ్య
నేటి గడిచే క్షణాలు మరుపురాని క్షణాలుగా మిగిలిపోతాయో, ఇక ముందు మరువలేని గాయాలుగా మిగిలిపోతాయో. ఎవరి ఊహకందని పచ్చి నిజం క్షణం క్షణం భయం భయం జీవించమంటున్నది కాలం. రేపన్నది నీకు ఉన్నదా ? నేడన్నది నిండుగా నిర్భయంగా జరుగుతుందా ? మనసు పొరలను చీల్చుతున్న అనుమానాలు రేపు అనేది ఊహ నేడు అనేది బాధ. మిగిపోతుందేమో గాధ తనువుల మధ్య తపనలకుందని దూరాలు .. నింగి కన్నీటి ధారులకు తెరపిలేదు. కష్టాల కడలికి అంతులేదు. తీరని దాహంతో కొట్టుమిట్టాడే పోరాటంతో గాలికే గాయపడ్డ జీవితాలు తేలిపోతున్నాయి ఆకుల మాదిరి నీటిలో....