...

2 views

మనిషి
పేరు:- మంజు ప్రీతం కుంటముక్కల
ఊరు:- మదనపల్లె
::::::::::::::::::::::::::::::::::::::::::::::
మనిషి ఓ మనిషి
నీకెందుకు ఈ దాగుడు మూతలు బ్రతుకంతా
ఓడిపోతావని తెలిసి
ఎప్పుడు పుటుక్కు మంటుందో తెలియని నీవు

బంధం అంటావు
ఆపేక్ష అంటావు
ఆగని కాలంతో పోటీ పడతావు
ఎడతెగని అనురాగాలు పెంచుకుంటావు

నువ్వే మిన్న అంటావు
నిన్నే కాలదన్నే వాడు లేడంటావు
అహం నింపుకుంటావు
అహం బ్రహ్మాస్మి అంటావు

నాలుగు రోజుల బ్రతుకుకు
ఎందుకని ఇంత ఆర్భాటం
గడవలేని అనాధులెందరో
బ్రతకలేని పెదరికాలెన్నో
అంతా తెలిసినా తెలియనట్లు
ఆడే దాగుడు మూతలు ఇంకెన్నాళ్లు ఓ మనిషి ..?

ధనమే గమ్యం కాదు
అహమే శాశ్వతం కాదు
నీ ప్రాణమే అద్భుతం
నలుగురి మంచి కోరుకో
నిన్ను నువ్వు ఉద్దరించుకో ..

------_--------------------------------
_---------------------------------------
© Manju Preetham Kuntamukkala