...

3 views

అందమైన స్వప్నం...💓
నా నయనాలను ఓ అందమైన స్వప్నం ముద్దాడిందీ గత రేయీ...
మొదటి సారి ఆ రెండు కన్నుల్లో ఆకాశమంత ప్రేమను చూశా...
అసలు ఎవరో నువ్వూ...ఎందుకా నవ్వూ..
ఈ ప్రశ్నే నిద్దుర దుప్పటితెరచాటున..
వంగివంగి అడుగుతున్నా..
ఇంక ఆ మాట
అది వలపుల మూట..లేదంటే
నూరు వరహాల తోటా...
కనులు కూడా మాటలు నేర్చుకుంటే అవి ఆ చూపులే...
నవ్వు కూడా తడమడం మొదలెడితే అవి తన అధరాలే...
గాలికి ఎగిరే నా ముంగురలకు సైతం సిగ్గు అద్దిన తన వైఖరి...
కలనీ తెలుస్తున్నా...కలవరమే ఎదనిండా...
కారణం తనే...
ఇంతకీ తానేవరు...???
© Rajani Reddy