...

1 views

చిగురాశ
చిన్ని చిరునవ్వులకు లేత చిగురాశలు మొలిచాయి అలా.. అకస్మాత్తుగా కాలం మారిందా లేక క్యాలెండర్ లో దిన వారాలు మారి సంవత్సరాలు పరిగెత్తాయా అలా. ఏదో అయ్యిందని ఎందుకో మార్పులని పదే పదే చెబుతూ ఊరుకోని మానసం.. లేత ప్రణయాల పాత పరిచయాలా పాత పరిచయాల లేత ప్రణయాలా కాలానికి కొవ్వొత్తి కాగడపడుతోందా ఉదయించని హృదయాలకు చీకటి తిమిరాలను తాకాలనే ఆశా.. కానుకే క్షణాలను పంచుతున్నదో స్తంభించిన కాలానికి దొర్లించిన క్షణాలు నదిలా పారిందో ఏమో సాగరం మనసు అయ్యిందేమో చంచలనం...
సంపంగి బూర✍️