...

10 views

నేను
ప్రపంచాన్ని శాసించటం కోసం,
దేశం అంతా నా రాతలు నింపటం కోసం,
రాష్ట్రం తలలో నాలుక అవడం కోసం,
నగరంలో కవయిత్రి గా మెప్పుల కోసం,
జిల్లా వార్తాపత్రికలో కవితలు ప్రచురణ కోసం,
మండలం పరధిలో సన్మానాలు జరగడం కోసం ,
ఊరిలో నా కవితలు చదవటం కోసం,
గృహంలో అంతా నన్ను చూసి గర్వ పడడం కోసం,

పై వాటికి ఆశ పడి,
అత్యాశ అనే ఉరుకు తో
నేను కలం పట్టలేదు ,పుస్తకం ముట్టలేదు.

నా దేశంలో జరుగుతున్న ఘోరాలు,
రాజ్యమేలుతున్న అవినీతులు పై
యుద్ధం చేయడమే సరైనది అని
కత్తి అనే కలం పట్టి
అక్షరమే ఆయుధంగా ఎంచుకోని,
పుస్తకంలో సత్యాలు అనే సాక్ష్యాలు రాస్తూ,
పాఠకుల అయినా ప్రజలకు
మంచిని మార్గంగా పరిచి,
తప్పును హెచ్చరికగా చెబుతూ,
నీతి, నిజాయితీ, ధర్మం, త్యాగం
ఇవే దేశ ఉన్నతికి సోపానాలు అంటూ,
జనుల తలరాతల మార్పు కోసం
నా రాతలు కవితలుగా రాస్తున్నాను✍
నావి నిర్దేశించే బాటలు మాత్రమే,
ఇక నిర్ణయం మీదే!!!

-ఆనం ఆశ్రిత రెడ్డి
anam aasritha















© Anam Aasritha