...

3 views

అదేమిటో కానీ...💕✍️

నేను రాసే కవితలలో
ఓనమాల మాటున
గడుసుదనపు చిత్తరువులే
నిన్ను కలవరపాటుకు గురి చేస్తే...
అదేమిటో నాకు ఆనందం..!!

నా సంతోషాల వెల్లువలో
దరహాసాల హాయిన
చిలిపిదనం
నిన్ను ఆపాదమస్తకం చుట్టేస్తే....
అదేమిటో నాకు సంబురాలు..!!

నా ఆనందాల అనుభూతిలో
ఊహల చాటున
కమ్మదనం
నిన్ను జోల పాటలై లాలిస్తే....
అదేమిటో నాకు పరవశాలు...!!

నా వేదనా మదిలో
కన్నీటి దోసిట
వెచ్చదనం
నిన్ను అణువణువూ కదిలిస్తే...
అదేమిటో నాకు జ్ఞాపకాలు..!!

నా మది గదిలో
మాటే చెప్పలేని
మౌనరాగం ఏమిటో కానీ..
నాకు నన్నే కొత్తగా చూపెడ్తుందీ మరీ..!!

Related Stories