...

8 views

నమ్మకంతో సాగించూ...✍️
అఆఇఈ అంటూ దిద్దేపుడూ అనుకుని ఉంటావా...అసలు ఊహించని మలుపులెన్నో జీవితాన అనీ..!!

తప్పటడుగులేసేపుడు ఆలోచించి ఉంటావా..అడుగడుగునా ఆవేదనలే అలుముకుంటాయి బతుకున అనీ..!!

అమ్మ ఒడిలో ఆడుకుంటున్నపుడూ కలనైనా కని ఉంటావా...కసిరికొట్టిన తలరాతలో కారుచీకట్లు కప్పేస్తాయి అనీ..!!

నాన్న భుజంపై ఎక్కితొక్కుతున్నపుడూ ఎరుకైనా వచ్చిందా...ఎదనిండా బాధనీ మోసే రోజొకటీ వస్తుందీ అనీ..!!

అయినా.. కానీ..కనులను కమ్మేసిన కారుచీకట్లకు కారణాలు వెతుకూ..కప్పేసిన గుబులు రెప్పలనీ నమ్మకమనే తాళపుచెవితో తెరువూ...
బతుకంటేనే పోరాటం...
భయమిడిచి చేస్తుంటే నిత్యసమరం...
భవిష్యత్తు బంగారుమయం...!!