...

2 views

రెండో వైపున:

మనుషుల మనసులను కలిపే మాటలే కాదు,
మనుషుల మనసును దహించి వేసే తూటాలు కూడా ఉంటాయి
పైకి ఎగరేసే చేతులే కాదు,
కిందకు ఎగదోసే కాళ్లు కూడా ఉంటాయి
కళ్ళల్లోనే కన్నీళ్లు కన్నీళ్లే కావు,
మనసులోని క్రోధానికి ఆజ్యం పోసే చమురు కూడా అవుతాయి
మనసు మృదుత్వానికే మారుపేరు కాదు,
రెండో వైపున చీకటి కోణాలు కూడా ఉంటాయి
వజ్రాల మిల మిల మెరిసే మనుషులే కాదు,
భయంకరమైన రహస్యాలు దాగున్న మనసులు కూడా ఉంటాయి
© All Rights Reserved