...

0 views

అందాల రాణి
కనుపాప నిను చూసి కలలెన్నో కంటుంది. నా మనసు నీ ధ్యాసలో నన్నే వద్దంటుంది. తోడై నీవుంటా వంటే స్వర్గమే వలదంటుంది. అర్ధాంగి అందాల రాశి అవుతే లోకంతో పనెందుకంటుంది. నీవు మాటాడే బంగారు మాట చాటుగా విన్న నాకు పుష్ప సుగంధ సువాసనలై నిండిన మనసు ఊహల్లో తేలిపోతుంది. అనుకుంటాం గానీ అయితే ఏమని నీవు అందాల రాణి పట్ట పువాసివి నేనో సాధారణ వ్యక్తిని. పొంతన లేనీ అనుకున్న మన బంధానికి హస్తి మశ్కాకాంతర బేధాలే. అనడానికి అభ్యంతర మేమీ లేదు కల గనడం నేరం కాదు. తలచి వలచి కాదని వెరచి మనసంతా మదన పడింది. నిద్దర రాని రాత్రి కన్నీటి బిందువుకు
దేహమై వేలాడి ఆడి ఆడి అలసి సొలసి తెగిన జలపాతంలో తెలియని అగాధంలోకి నన్ను నెట్టేసింది...
సంపంగి బూర✍️